ETV Bharat / city

తిరుపతి, కర్నూలులో ‘ప్లాస్మా’ సేకరణ

కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి నుంచి ‘ప్లాస్మా’ సేకరించి భద్రపరిచేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం తిరుపతి. కర్నూలులో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది.

The Medical Health Department is taking steps to collect and store plasma samples from the victims of the coronary pandemic.
తిరుపతి, కర్నూలులో ‘ప్లాస్మా’ సేకరణ
author img

By

Published : May 6, 2020, 9:23 AM IST

కరోనా బారినపడి కోలుకున్న వారి నుంచి ‘ప్లాస్మా’ సేకరించి భద్రపరిచేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. తిరుపతి స్విమ్స్‌, కర్నూలు వైద్య కళాశాలలోని రక్తనిధి కేంద్రాల్లో ఈ ఏర్పాట్లు చేస్తోంది. వైరస్‌ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ చికిత్సకు ఆమోదం తెలపాలని ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్‌, తిరుపతి స్విమ్స్‌.. ఐసీఎంఆర్‌కు దరఖాస్తులు చేసుకున్నాయి. ఇంకా అనుమతి రాలేదు. మరోవైపు వైరస్‌ కేసుల నమోదు దృష్ట్యా అనంతపురం జిల్లా హిందూపురం ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా గుర్తించారు.

ఇవీ చదవండి...మా పయనం ఆగదు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.