ETV Bharat / city

అభివృద్ధిలో పాలుపంచుకునేవారికి ఇచ్చే గౌరవం ఇదేనా?: హైకోర్టు

పాఠశాలలకు విరాళాలిచ్చి, అభివృద్ధికి కృషిచేసిన దాతల పేర్లను ఆయా స్కూళ్లకు పెట్టేందుకు నిరాకరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దాతల అభ్యర్థనను తిరస్కరించడం సరికాదని హితవుపలికింది. రాష్ట్రంలో ఇలాంటి తరహా వ్యవహార శైలి కొనసాగితే .. విరాళాలు ఇవ్వడానికి , పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి ఎవరూ ముందుకురానని స్పష్టం చేసింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 30, 2022, 5:12 AM IST

పాఠశాలలకు విరాళాలిచ్చిన దాతలు సూచించిన పేర్లను ఆయా విద్యాలయాలకు పెట్టేందుకు అధికారులు నిరాకరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొర్రీలు వేసి దాతల అభ్యర్థనను తిరస్కరించడం సరికాదని హితవు పలికింది. రాష్ట్రంలో ఇలాంటి వ్యవహార శైలి కొనసాగితే విరాళాలివ్వడానికి, అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఎవరూ ముందుకురారని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరుతో అంతిమంగా రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపింది. అభివృద్ధిలో పాలుపంచుకునేవారికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై స్పష్టతనిచ్చేందుకు రికార్డులతో మే 5న న్యాయస్థానం ముందు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈమేరకు ఆదేశాలనిచ్చారు.

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట జడ్పీ ఉన్నత పాఠశాల పేరును తన తండ్రి నారపరెడ్డి సీతారామిరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలగా మార్చాలంటూ 2021 సెప్టెంబరులో ఆయన కుమారుడు, మాజీ సర్పంచి కిరణ్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తాను చేసిన అభ్యర్థనను పాఠశాల కమిషనర్‌ తిరస్కరించడాన్ని సవాలు చేశారు. పాఠశాలను దత్తత తీసుకొని రూ.41 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. ఆర్థికసాయం చేసినందుకు తన తండ్రి పేరును పాఠశాలకు పెట్టాలని విన్నవించారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ కమిటీ, గ్రామపంచాయతీ 2021 సెప్టెంబరు 6న తీర్మానించిందని పేర్కొన్నారు. పేరు మార్పునకు డీఈవో సైతం గుంటూరు ఆర్జేడీకి లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ వినతిని తిరస్కరిస్తూ ఏప్రిల్‌ 28న విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారని చెప్పారు. గుంటూరు ఆర్జేడీ ప్రతిపాదన 2021 నవంబరు 29న అందిందని తెలిపారు. రూ.10లక్షలు.. ఆపైన విలువైన భూమి, భవనం, ఆర్థికసాయం చేసిన దాతల పేర్లు పెట్టేందుకు వీలుగా 2004 నవంబరు14న ఇచ్చిన జీవో 162 స్థానంలో 2021 అక్టోబరు 6న జీవో13ను తెచ్చామని అన్నారు. జీపీ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. జీవో13 ప్రకారం రూ.3 కోట్లు విరాళంగా ఇస్తేనే పాఠశాల పేరుపై హక్కులు కల్పిస్తామన్నట్లు కనిపిస్తోందని అన్నారు. పిటిషనర్‌ పాఠశాల పేరు మార్పునకు జీవో13 జారీకి ముందే 2021 సెప్టెంబరు7న వినతినిచ్చారని గుర్తుచేశారు. అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో జాప్యం చేసి పిటిషనర్‌ వినతిని తిరస్కరించడం సరికాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.