వార్షిక డెడ్రెంట్ విలువకు పది రెట్లు ప్రీమియం మొత్తంగా చెల్లించాలని పేర్కొంటూ గనుల శాఖ ఈ ఏడాది ఆగస్టు 4 ఇచ్చిన జీవో 65 ఆధారంగా పిటిషనర్ సంస్థపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేయాలని పేర్కొంటూ విచారణను ఈనెల 23 వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
చిన్న తరహా ఖనిజాల లీజుకోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు .. విస్తీర్ణానికి వార్షిక డెడ్రెంట్ విలువకు పది రెట్లు ప్రీమియం మొత్తంగా చెల్లించాలని పేర్కొంటూ గనుల శాఖ ఇచ్చిన జీవో 65ను సవాల్ చేస్తూ వన్మైన్ సంస్థ హైకోర్టులో వ్యాజ్యం వేసింది.
ఇదీ చదవండి