రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు 4వారాల పాటు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.
సంబంధిత కథనం: