హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు జారీచేసిన మద్యంతర ఉత్తర్వులన్నింటిని జూన్ 30 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 21 నాటికి అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను బేషరతుగా పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపువల్ల ప్రభావితులయిన వారు ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుకునే స్వేచ్ఛనిచ్చింది. వ్యాజ్యంపై విచారణను జూన్ 25 కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కరోనా విస్తృతమవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాలు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను బేషరతుగా పొడిగించే నిమిత్తం హైకోర్టు సుమోటోగా వ్యాజ్యాన్ని నమోదు చేసింది. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. చాలామంది న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కరోనాతో బాధపడుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ఈనేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులన్నింటిని పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది.
ఇవీ చదవండి