ETV Bharat / city

ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం - high court latest news

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​లో ఉత్తీర్ణత సాధించకపోయినా డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి హైకోర్టు నిరాకరించిది. డీసెట్​లో ఉత్తీర్ణత ఉంటేనే ప్రవేశాలకు అర్హత ఉంటుందన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అర్హతతో సంబంధం లేకుండా ప్రవేశాలకు అనుమతివ్వాలన్న డీఈడీ కళాశాల యాజమాన్యాల అభ్యర్థనను తోసిపుచ్చింది. కళాశాలలు దాఖలు చేసిన వ్యాజ్యాల్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

The High Court agreed with the Government's arguments
ఉన్నత న్యాయస్థానం
author img

By

Published : Jul 25, 2020, 1:56 AM IST

ర్యాంకుల అర్హతతో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం తావివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ... సుమారు 100కుపైగా డీఈడీ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీసెట్ ర్యాంక్​తో సంబంధం లేకుండా కన్వీనర్, యజామాన్య కోటాలో ప్రవేశాలు ఇచ్చేందుకు అనుమతివ్వాలని కోరాయి. ఆ అభ్యర్థనపై ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆర్హత సాధించలేనివారికి ఇష్టానుసారంగా ప్రవేశాలు కల్పిస్తే... ప్రాథమిక విద్యపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు. అర్హత సాధించిన వారికే ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రవేశాల విషయంలో గత ప్రభుత్వం ఓసారి ఇచ్చిన మినహాయింపును ఆధారం చేసుకొని డీఈడీ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పిస్తున్నారన్నారని పేర్కొన్నారు. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. వ్యాజ్యాలను కొట్టేశారు.

ఇదీ చదవండీ... దళితులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.