ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
అత్యవసర విచారణ సాధ్యం కాదు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈనెల 24న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది సుధాకర్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిల్దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలిపారు. కాగా..అత్యవసర విచారణ సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం అయినా విచారణ జరపాలని న్యాయవాది కోరగా...ముందు పిల్ దాఖలు చేయాలని..,విచారణ జరిపే అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని తెలిపింది.
ఇదీ చదవండి: