ETV Bharat / city

గల్ఫ్​లో తెలంగాణ వాసుల గోడు... వంద మందికి పైగా గల్లంతు..!

ఉన్న ఊరిలో ఉపాధి కరవై.. కాయకష్టం చేసి నాలుగు రాళ్లు సంపాదిద్దామని ఏటా ఎంతోమంది కోటి ఆశలతో ఎడారి దేశాలకు వెళ్తున్నారు. తల తాకట్టు పెట్టి అప్పులు చేసి.. ఏజెంట్లను ఆశ్రయించి గల్ఫ్‌కు పయనమవుతున్నారు. అక్కడికి వెళ్లిన కొత్తలో అంతా బాగుందని కుటుంబ సభ్యులతో చెప్పినా.. ఆ తర్వాత కొన్నాళ్లకే వారి నుంచి క్షేమ సమాచారం అందడం లేదు. వారేమయ్యారో కూడా తెలియడం లేదు. తినడానికి సరైన తిండి లేక.. ఉండటానికి గూడు లేక.. పనీ దొరక్క.. అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను తాళలేక కొందరు రెక్కలు విరిగిన పక్షుల్లా స్వగ్రామాలకు చేరుతుండగా.. మరికొందరు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి తనువు చాలిస్తున్నారు. ఇక ఏటా వందల మంది అసలు జాడే తెలియకుండా పోతున్నారు. వారు ఎన్నటికైనా తిరిగొస్తారన్న ఆశతో కుటుంబ సభ్యులు కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి. తమవారు ఎక్కడున్నారో.. ఎట్లున్నారో ఆచూకీ తెలియక ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.

GULF
GULF
author img

By

Published : Feb 26, 2021, 9:38 AM IST

కన్నీరింకిన కళ్లతో...

కుమారుడి కోసం ఎదురుచూపు

తెలంగాణ నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన ఇర్ల సాయమ్మ-రాజారెడ్డిల ఒక్కగానొక్క సంతానం కృష్ణారెడ్డి. ఇంటర్‌ పూర్తి చేశాడు. బతుకుబండి లాగడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కళ్లారా చూసి గల్ఫ్‌ వెళ్లాలని అనుకున్నాడు. గోదావరిఖనిలో మెకానిక్‌గా పనిచేస్తున్న సమయంలో తోటి మెకానిక్‌లతో కలిసి గల్ఫ్‌ వెళ్లాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు కోరికను కాదనలేక వారు రూ.2 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఏజెంట్‌ సాయంతో 2013లో పాతికేళ్ల వయసులోనే దుబాయ్‌ వెళ్లాడు. అక్కడి కంపెనీలో కొద్ది రోజులు పనిచేశాడన్న సమాచారం ఉంది. ఆ తర్వాత జాడలేదు. దుబాయ్‌లో ఉంటున్న కూచన్‌పెల్లి గ్రామస్థులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. తొమ్మిది నెలల క్రితం తండ్రి రాజారెడ్డి చనిపోయారు. తల్లి సాయమ్మ (60) ఉన్న ఇల్లు అమ్మేసి అప్పులు కట్టి అద్దె ఇంట్లో ఉంటోంది. ఎన్నటికైనా తన కుమారుడు తిరిగివస్తాడన్న ఆశతో బతుకుతున్నానని రోదిస్తూ తెలిపింది.

30 ఏళ్లుగా తెలియని ఆచూకీ

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండల కేంద్రానికి చెందిన కొత్తూరు అడెల్లుది మరో గాథ. ఈయన 30 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొన్ని నెలలకు ఓ కేసులో జైలు శిక్ష పడింది. అప్పటినుంచి ఇంటికి రాలేదు. కానీ.. ‘జమాంజా అరన్న’ పేరిట రియాద్‌లోని మలజ్‌ జైలు నుంచి వీరింటికి ఉత్తరాలు వచ్చాయి. అడెల్లుకు చదువు రాకపోయినా వేరేవారితో ఉత్తరాలు రాయించి పంపించాడని ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు అనుకుంటూ వచ్చారు. అక్కడున్న వారికి తెలుగు అర్థం కాక అడెల్లు పేరును జమాంజా అరన్నగా రాసి ఉంటారని భావించారు. ఈ ఉత్తరాలు 2009 వరకు వచ్చి ఆగిపోయాయి. అడెల్లు ఆచూకీ కోసం భారత రాయబార కార్యాలయానికి ఫోన్‌ చేస్తే.. జైలులో ఉన్నాడని చెబుతున్నారు. ఏ జైల్లో ఉన్నారు.. ఏమయ్యాడోనన్నది ఇప్పటికీ తెలియడం లేదు. తల్లి లసుంబాయి, భార్య ఎర్రవ్వ, కుమారులు శ్రీనివాస్‌, రాము అడెల్లు ఆచూకీ కోసం ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

  • జగిత్యాల జిల్లా కమ్మరిపేట్‌ గ్రామానికి చెందిన్న తాలూకా చిన్నన్న 2012 బహ్రెయిన్‌కు వెళ్లారు. ఏజెంట్‌ మాయమాటలు నమ్మి వేరే వ్యక్తి పాస్‌పోర్టుపై అక్కడికి చేరుకున్నారు. ఆదిలో ఓ కంపెనీలో పనిచేసినన్ని రోజులు కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. ఆ తర్వాత ఎక్కడున్నారో.. ఏమయ్యారో సమాచారం కూడా తెలియడం లేదు. తన భర్త ఆచూకీ తెలపాలంటూ భార్య శోభ ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ ఆలకించడం లేదు.
  • జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేట్‌కు చెందిన తోట మోహన్‌ 2014లో ఇరాక్‌ వెళ్లారు. 2 నెలల వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత జాడ తెలియడం లేదు.
  • నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలానికి చెందిన రవి 20 ఏళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిచేసిన రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఉంది.
ఎదురుచూపులు

గల్ఫ్‌లో గోస ఇలా..

  • ఆచూకీ తెలియని రాష్ట్రవాసులు: 100 నుంచి 120 మంది వరకు
  • ఏటా వివిధ కారణాలతో మరణిస్తున్న రాష్ట్రవాసులు:150 నుంచి 200 మంది వరకు (హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నమోదైన సంఖ్య ఆధారంగా)
  • పనుల్లేక ఏటా కంపెనీలు తిప్పిపంపిస్తున్నవారు: 300 మంది వరకు
  • 2014 నుంచి బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఏటా చనిపోతున్న భారతీయులు: 5వేల మందికి పైగా (ఇందులో వలసకార్మికులూ ఉన్నారు. ఈ వివరాలను ఎంపీ ఉత్తమ్‌ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వెల్లడించారు.)
  • గల్ఫ్‌ కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
-స్వదేశ్‌ పరికిపండ్ల, ప్రవాసిమిత్ర కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, నిర్మల్‌

గల్ఫ్‌ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. చట్టబద్ధంగా ఏర్పడే ఈ బోర్డు ప్రభుత్వాలు మారినా అలాగే ఉంటుంది. బోర్డు సభ్యుల నియామకంలో విదేశాల్లో, స్వదేశంలో ఉన్న వారికి ప్రాతినిధ్యం కల్పిస్తారు. విదేశాల్లో ఉన్న సభ్యులు అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. స్వదేశంలో ఉన్న వారు గల్ఫ్‌ నుంచి వచ్చిన కార్మికుల పునరావాసం, ఉపాధి గురించి కృషి చేస్తారు. గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న కార్మికులతో పాటు వారి కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఆచూకీ తెలియనివారిని గుర్తించి స్వగ్రామాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలి. -స్వదేశ్‌ పరికిపండ్ల, ప్రవాసిమిత్ర కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, నిర్మల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.