పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోనే శామ్యూల్ ఆనంద్ కుమార్ పని చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్సీ కార్పొరేషన్ వీసీ ఎండీగా శామ్యూల్ కుమార్ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.
మరోవైపు వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఆవుల రమేష్ రెడ్డిని ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తిరుపతి అర్బన్ ఎస్పీ నుంచి సాధారణ పరిపాలన శాఖకు రమేష్ రెడ్డి రిపోర్ట్ చేశారు.
ఇదీ చదవండి: