తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ పరిధిలో సంచరిస్తున్న మానుపిల్లిని అటవీ సిబ్బంది బంధించారు. కొంతమంది స్థానికులు దానిని చూసి బ్లాక్ పాంథర్ అనుకుని భయాభ్రంతులకు గురయ్యారు. సంచరిస్తున్న మానుపిల్లి దృశ్యాలని తీసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది.. అది బ్లాక్ పాంథర్ కాదని నిర్ధరించారు. మానుపిల్లిని జూపార్కుకు తరలించారు. తగిన రక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీసీఎఫ్ శోభ వెల్లడించారు. స్థానికులు ఎలాంటి భయాందోళన చెందవద్దని సూచించారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ మ్యారేజ్: డాక్టర్తో యాక్టర్ ప్రణయగానం