మహానాడు వేడుక మొదటి రోజు ముగిసింది. తొలిరోజు కాన్ఫరెన్స్‌లో 14 వేల మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇతర మాధ్యమాల ద్వారా వేలమంది వీక్షించారు. తొలిరోజు విద్యుత్ ఛార్జీల పెంపు, వలసకూలీల అవస్థలు, తితిదే భూముల వివాదం, సాగునీటి ప్రాజెక్టులు, ఏడాది అరాచక పాలన, అన్నదాతకు అన్యాయం చేశారనే తీర్మానాలను నేతలు ప్రవేశపెట్టారు. వైకాపా ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
ఇదీ చదవండి: