రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున తలపెట్టిన 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేయాల్సిందేనని ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. వ్యక్తిగత లబ్ధి పరిధిలోకి ఈ అంశం వస్తున్నందున ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేఖా రాలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేసుకోవచ్చని... దైనందిన కార్యక్రమాల కొనసాగింపు ప్రభుత్వ బాధ్యతన్నారు.
'ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతించం' - ఏపీ స్థానిక ఎన్నికలు తాజా
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఉగాది రోజు ఇళ్ల పట్టాల పంపిణీని అనుమతించమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అనుమతి కోరుతూ ప్రభుత్వం నుంచి లేఖ రాలేదని వెల్లడించారు.