ETV Bharat / city

Corona Deaths: దంపతులు మృతి, అనాథలుగా మారిన పిల్లలు

author img

By

Published : May 28, 2021, 7:55 AM IST

అంతు చిక్కని కరోనా వ్యాధితో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా దిగజారి రోడ్డున పడుతుండగా.. మరికొన్ని కుటుంబాల్లో పెద్ద దిక్కులు మరణించడంతో అనేక మంది అనాథలుగా మారిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో దంపతులు మృతి (corona deaths) చెందడంతో వారి పిల్లలు దిక్కులేని (children orphaned) వారయ్యారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

coron death
కరోనా మృతి

కరోనా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. కరోనా చిచ్చుతో ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. కొవిడ్​ వైరస్ బారిన పడి 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా (children orphaned) మారిపోయారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకి చెందిన కుడికళ్ల మల్లేష్(30), అతని భార్య సృజన(26) దంపతులు కరోనాతో మరణించడంతో(corona deaths) ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మల్లేష్ 10 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్​కి వెళ్లి ఓ మెడికల్ అండ్ జనరల్ స్టోర్​ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. వారికి మణిదీప్ (11), శ్రీచరణ్ (7)ఇద్దరు పిల్లలు… 10 రోజుల క్రితం వారు కరోనా బారిన పడడంతో కరీంనగర్​లోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజున మల్లేష్ మృతి చెందగా... గురువారం అతని భార్య సృజన కూడా మృతి చెందింది. దీంతో వారిని స్వగ్రామమైన బేగంపేటకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి: నైరుతి రుతుపవనాల ఆగమనం : రాగల 3 రోజులూ మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.