ETV Bharat / city

గుట్టు వీడింది: ఆరు వేళ్లకు ఆ జన్యువే కారణం

సాధారణంగా అందరి చేతులు, కాళ్లకు 5 వేళ్లు ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం 6 వేళ్లు ఉండటమూ చూసుంటాం. అలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?

గుట్టు వీడింది: ఆరు వేళ్లకు ఆ జన్యువే కారణం
గుట్టు వీడింది: ఆరు వేళ్లకు ఆ జన్యువే కారణం
author img

By

Published : May 5, 2020, 2:43 PM IST

కొంతమంది చేతులు, కాళ్లకు 6 వేళ్లు ఉండటం గమనించే ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాజాగా సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నసిస్‌(సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్త అశ్విన్‌ దలాల్‌ దీనికి కారణం కనుగొన్నారు. దీనికి సంబంధించి ఆయన రాసిన పరిశోధన వ్యాసం అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ జెనిటిక్స్‌లో ప్రచురితమైంది.

తన బృందంతో కలిసి అశ్విన్‌ దలాల్‌ కొంతకాలంగా దీనిపై పరిశోధన చేస్తున్నారు. బీహెచ్‌ఎల్‌హెచ్‌ఎ9 అనే జన్యువు పరివర్తన చెందడమే 6 వేళ్లు ఏర్పడడానికి కారణమని, సమీప బంధువులను వివాహాలు చేసుకుంటే దీనికి అవకాశం ఉంటుందని ఆయన పరిశోధనలో వెల్లడైంది. ఈ ఆవిష్కరణ ద్వారా భవిష్యత్తులో ముందుగానే జన్యు పరీక్షలు నిర్వహించి పుట్టే పిల్లల్లో ఈ లోపం సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి:

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో కలవరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.