ETV Bharat / city

అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి - AP government news

రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ...ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు అదనపు ఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా, 40 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్‌ లభించింది.

AP government has issued orders promoting several additional SPs and DSPs in the stat
అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి
author img

By

Published : Jun 23, 2020, 8:52 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఐదుగురు అదనపు ఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా, 40 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్‌ లభించింది. 2019-20 ప్యానల్‌ సంవత్సరానికి సంబంధించిన జాబితాలోని అధికారులకు ఉద్యోగోన్నతి కల్పించారు. నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు పొందిన వారిలో షేక్‌ నవాబ్‌జాన్‌, బి. అచ్యుతరావు, జి.ఆంజనేయులు, ఎంవీఎస్‌ స్వామి, వై.తిమ్మనాయుడులు ఉన్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి: డిగ్రీ, బీటెక్ పరీక్షలపై కీలక నిర్ణయం నేడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.