ETV Bharat / city

Students Return: యుద్ధభూమి నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు - ఉక్రెయిన్​ నుంచి తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైలు

Telugu students: ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియా నగరంలో ఉన్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్‌ దేశ సరిహద్దు దాటించి హంగరీలోని బుడాపెస్ట్‌ విమానాశ్రయానికి చేర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు సుమారు 1500 మంది భారతీయ విద్యార్థులు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్నారు.

Telugu students started From Ukraine in train
ఉక్రెయిన్​ నుంచి రైలుగ
author img

By

Published : Mar 2, 2022, 8:05 AM IST

Telugu students: వైద్యశాస్త్రం చదువుదామని ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియా నగరంలో ఉన్న ‘జపోరిఝఝియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ’కి వెళ్లిన భారతీయులకు పెద్ద ఉపశమనం లభించింది. ఆ నగరంలో ఉన్న భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి కేంద్రం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. భారత రాయబార కార్యాలయ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్‌ దేశ సరిహద్దు దాటించి హంగరీలోని బుడాపెస్ట్‌ విమానాశ్రయానికి చేర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు సుమారు 1500 మంది భారతీయ విద్యార్థులు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్నారు. వారందరినీ బస్సుల్లో సమీపంలోని రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు.

Telugu students: బుడాపెస్ట్‌ విమానాశ్రయానికి వచ్చాక వారందరినీ విమానాల్లో భారత్‌కు తీసుకురానున్నారు. జపోరిఝఝియా నగరం నుంచి హంగరీ సరిహద్దుకు వేసిన రైలులో సుమారు వంద మంది తెలుగువారున్నారని, వీరిలో దాదాపు 10 మంది విశాఖ విద్యార్థులున్నారని సమాచారం. మరోవైపు ఉక్రెయిన్‌ నుంచి 17 మంది తెలుగు విద్యార్థులు మంగళవారం దిల్లీ చేరుకున్నారు. వీరిలో 11 మంది తెలంగాణ విద్యార్థులు కాగా.. ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.

విజయవాడకు విమానం నడపండి

Telugu students: ఉక్రెయిన్‌ సరిహద్దుకు చేరుకునే విద్యార్థులను నేరుగా విజయవాడకు తీసుకొచ్చేలా ప్రత్యేక విమానం నడిపేలా చూడాలని... కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గాబాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ లేఖరాశారు. 620 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నట్లు వెల్లడించారు. ఇందులో 301 మంది రెండు రైళ్లలో హుజ్జోరోడ్‌ చేరుకోనున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న మన రాష్ట్ర విద్యార్థులు, తెలుగువారు కలిపి 699 మంది వివరాలు సేకరించామని ఏపీలో ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తెలిపింది.

ఇదీ చదవండి:

అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్న రష్యా.. అక్కడే ప్రయోగం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.