ETV Bharat / city

Telugu Language Day సొంత నేలపైనే అస్తిత్వ పోరాటం

author img

By

Published : Aug 29, 2022, 8:33 AM IST

Telugu Language Day తెలుగు. అమ్మ నేర్పిన ఆది భాష. 56 అక్షరాల అందమైన పూదోట. సుందర తెలుంగునిల్‌ పాట సెయిత్తు అంటూ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయార్‌ పులకించినా. పాడనా తెలుగు పాట అంటూ దేవులపల్లి కీర్తించినా. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయలు తన్మయం పొందినా. అది తెలుగు భాష తియ్యందనాల గొప్పదనమే. ఇలాంటి భాషకు సొంతగడ్డపైనే అన్యాయం జరుగుతోంది. ఉనికి కోసం తెలుగుతల్లి సంఘర్షణ పడుతోంది. ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు కనిపించడం లేదు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు నేలపైనే తెలుగుకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక కథనమిదీ.

Telugu Language Day
తెలుగు భాష

Telugu Language Day అయ్యా.. మీ పాదములంటి అడుగుతున్నాను. ఈసారికి నన్ను మన్నించండి. తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి వస్తాను. మీ పలుకులు వింటా. కానీ, వేదిక ఎక్కను. సత్కారం స్వీకరించను. మన గడ్డపై మన బిడ్డలకు అన్ని పాఠశాలల్లో మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందేవరకు ప్రభుత్వం నుంచి సన్మానం, సహకారం స్వీకరించకూడదని ‘తెలుగుదండు’ ప్రతిజ్ఞ. ఇది రాజకీయాలతో, వ్యక్తిగతాలతో సంబంధం లేని ఉద్యమ నియమం. -ప్రభుత్వ సన్మానాన్ని తిరస్కరిస్తూ పరవస్తు ఫణిశయన సూరి చేసిన విన్నపం

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర, ప్రత్యుత్తరాలు ఆంగ్లంలోనే ఎందుకు సాగించాలి? సామాన్యుడికి అర్థమయ్యేలా తెలుగులో సరళంగా ఇస్తే వచ్చే ఇబ్బందులేంటీ? అంతర్గత సమావేశాల్లోనూ అధికారులంతా దాదాపు ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడి నియామక ఉత్తర్వు మినహా మిగతా ఉత్తర్వులన్నీ ఆంగ్లంలోనే వస్తున్నాయి. చివరికి తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ తాత్కాలిక అధ్యక్షుడి నియామక ఉత్తర్వునైనా మన భాషలో ఇవ్వలేదు. అఖిల భారత సర్వీసు అధికారులంతా యూపీఎస్సీ నిర్వహించే తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులైనవారే. కంప్యూటర్‌ వాడకానికి అనుగుణంగా తెలుగు అక్షరాలు(ఫాంట్స్‌) ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయినా... వాడకంపై చొరవ చూపడంలేదు. ‘ఉప-పరిచ్ఛేదము(20) తరువాత, ఈ క్రింది ఉప-పరిచ్ఛేదమును చొప్పించవలెను, అదేదనగా’ ‘ప్రధాన చట్టము యొక్క 11వ పరిచ్ఛేదములోని, ఉప-పరిచ్ఛేదము(2)లో, ఖండము(13) తరువాత ఈ క్రింది ఖండమును చేర్చవలెను, అదేదనగా’... ఇది తెలుగు భాషే. మీకేమైనా అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో బిల్లుల రూపకల్పన, సవరణలో వాడుతున్న పదాలివి. ఉభయసభల్లో తెలుగులోనే చర్చలు సాగుతున్నా.. సభ్యులకిచ్చే సమాచారంలో వాడుతున్న తెలుగు పదాలు ఎవ్వరికీ మింగుడుపడడం లేదు.

ప్రాధికార సంస్థకు కార్యవర్గమేదీ?: అధికార భాషా సంఘం ఉన్నా... దాని పరిధి తెలుగు అమలుకు సలహాలివ్వడం వరకే పరిమితమైంది. మాతృభాష ప్రేమికుల పోరాటాల నేపథ్యంలో చట్టం ద్వారా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను 2018లో తీసుకొచ్చారు. తెలుగును అమలు చేయకుంటే జరిమానాలు, శిక్షలు విధించే అధికారం ఈ సంస్థకుంది. కానీ, ఇంతవరకు దీనికి కార్యవర్గాన్ని నియమించలేదు. 2022 జులై 5న తాత్కాలిక అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్షీ¨్మప్రసాద్‌ను నియమించారు. రాష్ట్ర, జిల్లా స్థాయులలో కార్యవర్గాలను ఏర్పాటు చేయలేదు. తెలుగు భాష, సాహిత్యం, పరిపాలన రంగాల్లో విశిష్ట అనుభవమున్న ముగ్గురు సభ్యులతో కూడిన శోధన బృందం(సెర్చ్‌ కమిటీ) నియమించాలి. దీని సిఫార్సుల మేరకు అధ్యక్షుడు, సభ్యులను నియమించాలి. ఇంతవరకు బృందమే ఏర్పాటు కాలేదు. అలాగే... అధికార భాషగా తెలుగు అమలుపై, విద్యారంగంలో వాడకంపై, ఈ-తెలుగు అభివృద్ధిపై, అనువాదాలు, ప్రచురణలపై, అంతర్జాతీయ తెలుగు అభివృద్ధిపై బృందాలను వేయాల్సి ఉంది. వీటి ఊసే లేదు.

కీలక స్థాయిలో పెద్దదెబ్బ
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర బడుల్లో తెలుగు మాధ్యమం పూర్తిగా కనుమరుగైంది. ఒక పాఠ్యాంశంగా తెలుగు ఉండాలనే నిబంధన ఉన్నా సీబీఎస్‌ఈ పాఠశాలలు, ఇంటర్‌లో ఇది అమలవడం లేదు. సీబీఎస్‌ఈ, ఇంటర్‌లలో భాష ఎంపిక ఐచ్ఛికం కావడంతో మార్కుల కోసం చాలామంది హిందీ, ఉర్దూ, సంస్కృతం ఎంచుకుంటున్నారు. తెలుగును ఎంచుకున్నా వారిలో చాలామంది స్పష్టంగా చదవలేకపోతున్నారు. అక్షర దోషాలు లేకుండా రాయడమూ లేదు. భవిష్యత్తులో మనభాషలో రాసేవారు, చదివేవారు ఉండకపోవచ్చనే ఆందోళన నెలకొంది.

ఆ దేశాల్లో మాతృభాష
ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి సాధించిన, సాధిస్తున్న దేశాలు మాతృభాషను కాదని ఆంగ్లం వెంట పరుగులు తీయడం లేదు. రష్యా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రెజిల్‌, తైవాన్‌, డెన్మార్క్‌, టర్కీ తదితర దేశాల్లోని పిల్లలు ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుతారు. చైనా, జపాన్‌, జర్మనీ, రష్యావంటి దేశాలు విజ్ఞాన శాస్త్రాల్ని వారి మాతృభాషలోనే బోధిస్తాయి. కొన్నిచోట్ల ఆంగ్లాన్ని ఒక సబ్జెక్టుగానే నేర్పుతున్నారు. మన నూతన జాతీయ విద్యా విధానం-2020 సైతం ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని సూచించింది.

పొరుగు రాష్ట్రాలు ఆదర్శం

తమిళనాడు: తమిళ మాధ్యమంలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో వెయిటేజీ ఉంది. ఇతర మాధ్యమాల వారు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైతే 3నెలల్లోగా తమిళం పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు బడుల్లోనూ తమిళాన్ని తప్పనిసరి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి రాసే లేఖల్లో తమిళమే వినియోగిస్తారు. వాటికి ఆంగ్లంతో కూడిన లేఖలను జత చేస్తారు. ఉత్తరప్రత్యుత్తరాలను తమిళంలోకి తర్జుమా చేసేందుకు అనువాదకులు ఉంటారు.

కర్ణాటక: కన్నడ మాధ్యమంలో దేశంలో ఎక్కడ చదువుకుంటున్నా కర్ణాటక ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.2,500 ఉపకార వేతనాన్ని అందిస్తోంది. ఉద్యోగాల్లోనూ 5% రిజర్వేషన్లు అమలు చేస్తోంది.

కేరళ: ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో మలయాళం అమలు పక్కాగా ఉంటుంది. ఇతర భాషల్లోని సాహిత్యాన్ని తమ భాషలోకి అనువాదం చేస్తూ పరిపుష్ఠం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.