ETV Bharat / city

సామూహిక ఆత్మహత్య ఘటన... ఎన్​హెచ్​ఆర్​సీకి తెదేపా లేఖలు - tdp letter to nhrc latest news

నంద్యాలకు చెందిన కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై జాతీయ మనవ హక్కుల కమిషన్​కు తెదేపా నేతలు లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని ఆరోపించారు. ఆత్మహత్యకు కారకులైన పోలీసు అధికారులకు బెయిల్ రావడం వెనుక అధికార పార్టీ పాత్ర ఉందని తమ ఫిర్యాదుల్లో నేతలు పేర్కొన్నారు.

Telugu Desam Party letters to the NHRC
ఎన్​హెచ్​ఆర్​సీకి తెదేపా లేఖలు
author img

By

Published : Nov 11, 2020, 10:57 PM IST

సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై జాతీయ మనవ హక్కుల కమిషన్​కు తెలుగుదేశం పార్టీ నేతలు ఫరూక్, నాగుల్ మీరా, నజీర్ అహ్మద్, పర్వీన్ తాజ్​లు విడివిడిగా లేఖలు రాశారు. ఏపీలో పోలీసుల దమనకాండ పెరిగిపోయిందని ఆరోపించారు. అధికార వైకాపా నాయకులతో ఓ వర్గం పోలీసులు కుమ్మకై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇద్దరు పిల్లలతో సహా ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయం చెయ్యాలని కోరారు.

రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీల పరిస్థితి దయనీయంగా మారిందన్న తెదేపా నేతలు... ముస్లింలపై అనేక దాడులు జరుగుతున్నా ఎక్కడా న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. 14 ఏళ్ల కుమార్తె, 7 ఏళ్ల కుమారుడితో కలిసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవటం ద్వారా బాలల హక్కులు ఏ విధంగా హరిస్తున్నారో తెలుస్తోందన్నారు. ఆత్మహత్యకు కారకులైన పోలీసు అధికారులకు బెయిల్ రావడం వెనుక అధికార పార్టీ పాత్ర ఉందని తమ తమ ఫిర్యాదుల్లో నేతలు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... ఎమ్మెల్యేల ఆగడాలను ఆపేదెవరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.