Solo Walking Trip: దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన సమరయోధులను స్మరించుకుంటూ.. హైదరాబాద్ బాలాపూర్‌కు చెందిన ఓ యువకుడు విజయయాత్ర చేపట్టాడు. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని.. 75 రోజుల్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడక యాత్ర చేయాలని సంకల్పించాడు 22 ఏళ్ల వంశీ శేఖర్.
Kashmir to Kanyakumari Solo Walking trip : ఇందులో భాగంగా.. సెప్టెంబర్ 16న ఈ యాత్ర మొదలు పెట్టి.. నవంబర్ 30న పూర్తి చేశాడు. మొత్తం 3,700 కిలోమీటర్లు నడిచి రికార్డు నెలకొల్పాడు. మంగళవారం రోజున హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నాడు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా చేపట్టిన ఈ విజయ యాత్రను.. స్వాతంత్య్ర సమరయోధులకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు.
ఇవీ చదవండి :
British discriminating Indian Soldiers: ఆంగ్లేయుల దోపిడీ, దాష్టీకాల్ని భరించటమే కాదు... వారి సామ్రాజ్యవాద శత్రుత్వాల్లోనూ భాగమైంది భారత్! ఆంగ్లేయుల ఆధిపత్యం నిలబెట్టేందుకు దేశంకాని దేశంలో... శత్రువుగాని శత్రువుతో యుద్ధాలు చేసి... వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తమ విజయాల్లో కీలకపాత్ర పోషించినా బ్రిటన్ ప్రభుత్వం వారిపట్ల కనీస గౌరవం చూపించలేదు. సైన్యంలో భర్తీ నుంచి చావు దాకా వారిని అహంకారంతో అవమానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Azadi Ka Amrit Mahotsav: భారత్‌లో బ్రిటిష్ ప్రభుత్వ అరాచకాలపై నల్ల జెండాలెత్తిన వారిలో కొందరు తెల్లవారూ ఉన్నారు. వారిలో అత్యంత ప్రభావం చూపిన ఇంగ్లాండ్‌లోని సామాన్య బ్రిటిషర్లనూ ఆలోచనలో పడేసిన... ఇంటాబయటా బ్రిటిష్ సర్కారును దోషిగా నిలబెట్టిన.. అరుదైన కలం యోధుడు బి.జి.హార్నిమన్! ఆంక్షలను బేఖాతరు చేస్తూ అత్యంత దారుణమైన మారణకాండను ప్రపంచానికి చాటిన ఈ పాత్రికేయుడిని ఏమీ చేయలేక ఓడెక్కించి లండన్ పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం! కానీ ఆయన దొడ్డిదారిన మళ్లీ వచ్చి స్వతంత్ర భారత్‌లో కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Azadi Ka Amrit Mahotsav: వాళ్లు సత్యాగ్రహులు కాదు.. నిరసనా తెలపలేదు.. తిరుగుబాట్లూ చేయలేదు.. ప్రకృతి కన్నెర్రకు బలైన బడుగు జీవులు! తినటానికి మెతుకు లేక ఎముకల గూళ్లుగా మారిన వారిని చూసి బండలు సైతం కరిగాయి.. కానీ బ్రిటిష్‌వారి గుండెలు కరగలేదు. బయట లక్షల మంది అన్నార్తుల మరణ మృదంగం వినిపిస్తుంటే.. దర్బార్‌లో రాణి పేరిట లక్షల ఖర్చుతో విందులు వినోదాలు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి