TS MINISTER ON AP TEACHERS : ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలోని సిద్దిపేటలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వజ్రోత్సవ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఏ ప్రభుత్వానికైనా వంద శాతం పనులను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి ఎలా లోపల వేస్తున్నారో.. తెరాస ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందో గమనించాలని సూచించారు. దేశంలోనే 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణదని కొనియాడారు.
ఇవీ చదవండి: