ETV Bharat / city

ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు.. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదు

టీఎస్ ఆర్టీసీ సమ్మెపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదని కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు ధర్మాసనం ముందు వాదించారు. మరోవైపు తెలంగాణ ఐఏఎస్​లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా సమాధానం చెబుతున్నారని అసహనం వ్యక్తం చేసింది.

తెలంగాణ హైకోర్టు
author img

By

Published : Nov 7, 2019, 4:49 PM IST

34 రోజులుగా టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలుసా? అని అధికారులను హెచ్చరించింది. టీఎస్ ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలతో ఈ రోజు విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, టీఎస్ ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు.. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదు
కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదన్న విషయం ధర్మాసనం ముందుంచారు. టీఎస్‌ఆర్టీసీలో 33శాతం వాటా ప్రశ్నే లేదని.. ఏపీఎస్‌ఆర్టీసీలోనే కేంద్రానికి 33 శాతం వాటా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటా టీఎస్‌ఆర్టీసీకి బదిలీ కాదని వెల్లడించారు.

విభజన పెండింగ్‌లో ఉంటే.. కొత్త ఆర్టీసీ ఎందుకు..?
విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర అడ్వకేట్​ జనరల్​, టీఎస్ ఆర్టీసీ ఎండీ కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విభజన పెండింగ్‌లో ఉన్నప్పుడు కొత్త ఆర్టీసీ ఎందుకు ఏర్పాటు చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది.

ఐఏఎస్​లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సమర్పించిన రెండు నివేదికలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐఏఎస్‌ స్థాయి అధికారులు ఈ విధంగా కోర్టుకు అసంపూర్ణంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నివేదిక ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారంటే.. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇంత దారుణంగా తప్పుడు వివరాలు ఇచ్చిన అధికారులను తన సర్వీసులో చూడలేదని తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని, అయితే తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావడంలేదని కోర్టు తెలిపింది.

మన్నించండి: రామకృష్ణారావు
తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికలపై ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా వివరణ ఇచ్చారు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని కోర్టుకు తెలిపారు. పొరపాటుకు మన్నించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. క్షమాపణ కోరటం సమాధానం కాదని, వాస్తవాలు చెప్పాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన నివేదికల్లోని అంకెలు, లెక్కలపై మరోసారి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ, ఆర్టీసీ నివేదికల్లో అంకెలు వేర్వేరుగా ఉన్నాయని, ఇందులో వేటిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రశ్నించింది. సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తారా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ లెక్కలతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ప్రజానీకాన్ని సైతం తప్పుదోవ పట్టించారంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.

ఇదీ చదవండి

మాటిచ్చా.. నిలబెట్టుకున్నా.. ఆదుకున్నా: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.