ETV Bharat / city

Jagan bail cancellation petition: జగన్ బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ పిటిషన్..విచారణ 2 వారాలు వాయిదా

Jagan bail cancellation petition: జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Telangana high court
Telangana high court
author img

By

Published : Dec 13, 2021, 4:14 PM IST

Jagan bail cancellation petition: జగన్ బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్​పై వాదనలు విన్న కోర్టు.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

సీబీఐ కోర్టు నిరాకరణ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్

MP Raghurama petition on Jagan bail cancellation: అక్రమాస్తుల కేసులో.. ముఖ్యమంత్రి జగన్​తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి​ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

రఘురామ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు

CBI court on YS Jagan's bail cancellation petition: జగన్, విజయసాయిరెడ్డి సాక్షులను ప్రలోభ పెడుతున్నారని, విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని సీబీఐ కోర్టులో రఘురామ వాదించారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్లు దాఖలు చేశారని జగన్, విజయ్ సాయిరెడ్డి సీబీఐ కోర్టులో వాదించారు. సీబీఐ మాత్రం ఏమీ వాదించకుండా.. పిటిషన్లలోని అంశాలపై చట్టప్రకారం విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనల అనంతరం.. రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్డు కొట్టేసింది. అయితే సీబీఐ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ.. తెలంగాణ హైకోర్టులో రఘరామ పిటిషన్ దాఖలు(MP Raghurama petition in Telangana High Court) చేశారు. తాజాగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రెండు వారాలకు వాయిదా వేసింది.

జగన్ వ్యక్తిగత హాజరుపై తీర్పు రిజర్వు

Jagan Assest Case: మరోవైపు అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఈనెల 6వ తేదీన తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో సీబీఐ కోర్టు నిరాకరించిందని గుర్తు చేశారు. జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయన్న సీబీఐ.. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం జరుగుతుందని ప్రస్తావించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.

ఇదీ చదవండి:

Interim Bail to Lakshmi Narayana: విశ్రాంత ఐఏఎస్‌ లక్ష్మీనారాయణకు మధ్యంతర బెయిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.