యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. ఎయిర్పోర్ట్లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు.
ఎయిర్పోర్ట్లో ఇటీవల ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆస్పత్రులకు పంపుతున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కథేంటి?