ETV Bharat / city

TS - AP Water Disputes: నీటిపారుదల దస్త్రాల డిజిటలైజేషన్‌ - జల వివాదం వార్తలు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో.. నీటిపారుదల దస్త్రాల డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 1944 నుంచి పత్రాలు వేలికితీసే పనిలో అధికారులు మునిగిపోయారు.

నీటిపారుదల దస్త్రాల డిజిటలైజేషన్‌
నీటిపారుదల దస్త్రాల డిజిటలైజేషన్‌
author img

By

Published : Aug 13, 2021, 10:20 AM IST

నదీ జలాల వివాదాల నేపథ్యంలో న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లలో బలమైన వాదనలు వినిపించడానికి వీలుగా ఆధారాలు సమర్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1944 నుంచి ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలు, నీటి కేటాయింపులు, హైదరాబాద్‌ స్టేట్‌లో జారీ అయిన జీవోలు, ఉమ్మడి రాష్ట్రంలోని ఉత్తర్వుల పత్రాలను డిజిటలైజ్‌ చేయనుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కృష్ణా, గోదావరి బోర్డులు, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదులు చేయడంతో పాటు పలు ఆధారాలను సమర్పించాల్సి వస్తోంది. అప్పటికప్పుడు పత్రాలను వెలికితీసి సమర్పిస్తున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి ఆధారాలున్నా వాటి ఆచూకీ కనుగొనడం సాధ్యం కావడం లేదు. నీటిపారుదల శాఖలో దాదాపు ఐదు లక్షల పత్రాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రం గత నెలలో జారీ చేసిన గెజిట్‌లో 1980 నాటి ప్రాజెక్టులనూ అనుమతి లేని వాటి జాబితాలో చేర్చింది. వాటికి సంబంధించిన పత్రాలనూ సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖకు చెందిన పత్రాలను డిజిటలైజ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఈ అంశంపై గురువారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఐటీ నిపుణులు, ఐబీఎం సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి పత్రాలన్నింటినీ డిజిటల్‌ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘పాలమూరు’ పర్యావరణ అనుమతులపై సమావేశం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశలోని కాలువల నిర్మాణాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా వచ్చేలా తోడ్పాటు అందించాలని ప్రాజెక్టు ఇంజినీర్లను రజత్‌కుమార్‌ కోరారు. ఈ నెల 10న ఆరు జిల్లాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, మినిట్స్‌ ఆఫ్‌ మీటింగ్‌, కన్సల్టెంట్‌కు నివేదిక అప్పగింతపై సీఈ హమీద్‌ఖాన్‌తో కలిసి ఆయన సమీక్షించారు.

ఇదీ చూడండి:

'15కోట్ల మంది బాలలు, యువత చదువుకు దూరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.