ETV Bharat / city

Power generation in Telangana : విద్యుదుత్పత్తిలో తెలంగాణ, సింగరేణి టాప్ - amaravati news

విద్యుదుత్పత్తి(Power generation in Telangana)లో తెలంగాణ జెన్​కో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలు(Singareni Thermal Power Project) దేశంలో వరుసగా తొలి రెండు ర్యాంకులు సాధించాయి. ఏపీ జెన్​కో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యుత్ శాఖ వెలువరించిన నివేదికలో ఈ ర్యాంకులు ప్రకటించింది.

Power generation in Telangana
Power generation in Telangana
author img

By

Published : Oct 3, 2021, 8:53 AM IST

విద్యుదుత్పత్తి(Power generation in Telangana)లో తెలంగాణ ప్రభుత్వ జెన్‌కో(Telangana State Power Generation Corporation Limited), సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు(Singareni Thermal Power Project) దేశంలో వరుసగా తొలి రెండు ర్యాంకులు సాధించాయి. గతేడాది(2020-21) తెలంగాణ థర్మల్‌ కేంద్రాలు 72.35 శాతం, సింగరేణి విద్యుత్‌ కేంద్రం(Singareni Thermal Power Project) ఉత్పత్తి శాతం(పీఎల్‌ఎఫ్‌) 69.87తో ముందంజలో నిలిచాయని కేంద్ర విద్యుత్‌శాఖ వెలువరించిన నివేదికలో ప్రకటించింది. ఒక కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం కరెంటును ఉత్పత్తి చేసిందో దాన్ని ‘పీఎల్‌ఎఫ్‌’గా పిలుస్తారు. ఆ ప్రకారం విద్యుత్‌ కేంద్రాల పనితీరును ఏటా ర్యాంకుల ద్వారా విద్యుత్‌శాఖ వెల్లడిస్తుంది.

దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ జెన్‌కో(Telangana State Power Generation Corporation Limited)ల్లో తెలంగాణ అగ్రస్థానం, సింగరేణి(Singareni Thermal Power Project) రెండో స్థానం, ఛత్తీస్‌గఢ్‌ 3, ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో 9వ స్థానంలో ఉన్నాయి. జాతీయస్థాయి సగటు పీఎల్‌ఎఫ్‌ 54.49 శాతం కాగా.. దీనికన్నా తెలంగాణ జెన్‌కో(Telangana State Power Generation Corporation Limited) 17.86 శాతం అధికంగా ఉత్పత్తి చేసి అగ్రస్థానం పొందింది. ఏపీ జెన్‌కో కేంద్రాల సగటు పీఎల్‌ఎఫ్‌ 51.57తో జాతీయ సగటుకన్నా 2.92 శాతం తక్కువతో 9వ స్థానంలో నిలిచింది.

ఎన్టీపీసీ రెపరెప

కేంద్ర ప్రభుత్వ థర్మల్‌ కేంద్రా(Power generation in Telangana)ల్లో 80.30 శాతంతో ఎన్టీపీసీ సంస్థలు ముందున్నాయి. ప్రైవేటు రంగసంస్థల్లో మహారాష్ట్రలోని దహను వద్దనున్న రిలయన్స్‌ కేంద్రం 73.30 శాతంతో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ జెన్‌కో(Telangana State Power Generation Corporation Limited)కు చెందిన పాల్వంచలో 7వదశ విద్యుత్‌ కేంద్రం అత్యధికంగా 87.18, ఆరోదశ ప్లాంటు 81.20 శాతం కరెంటు ఉత్పత్తి చేశాయి. రోజువారీగా లెక్కిస్తే ఈఏడాది ఏప్రిల్‌ 7న రికార్డు స్థాయిలో 8.41 కోట్ల యూనిట్ల ఉత్పత్తి జరిగింది. నెలవారీగా చూస్తే ఈఏడాది మార్చిలో 235.40 కోట్ల యూనిట్ల తయారీతో కొత్త రికార్డు నమోదైంది.

ఇదీ చదవండి:

RAINS IN AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.