జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఈనెల 9న నిర్వహించే బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదని తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున భేటీకి రాలేమని లేఖలో పేర్కొన్నారు. బోర్డు సమావేశానికి మరో తేదీ ఖరారు చేయాలని ఈఎన్‌సీ కోరారు. వీలైనంత త్వరగా బోర్డును సమావేశపర్చాలన్నారు.
అటు... కృష్ణా బోర్డుకు కూడా ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలపడంపై నిరసన తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టు పరిశీలన బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందరావు ఉండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని.. గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని మురళీధర్ లేఖలో గుర్తు చేశారు. ప్రాజెక్టుల పరిశీలన బృందంలో కె. శ్రీనివాస్ ఉన్నారని చెప్పారు. అయినా తాము అభ్యంతరం చెప్పలేదని లేఖలో ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ అధికారికి ప్రాంతాలను ఆపాదించడం అనైతికమని వ్యాఖ్యానించారు. ఎన్జీటీ ఆదేశాలను ఆలస్యం చేయడమే ఏపీ ఉద్దేశమని మురళీధర్ ఆక్షేపించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ రాయలసీమ పనులు పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ పనుల పరిశీలనపై ఈనెల 9 లోగా నివేదిక ఇవ్వాలన్నారు.
ఈ నెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి (KRMB, GRMB Boards Meeting) సమావేశం జరగనుందని కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం నిర్వహించనున్నారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీలో గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే.. రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అజెండా అంశాలపై చర్చకు సంబంధించిన డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులను కోరారు.
ఇదీ చదవండి:
KRMB, GRMB Boards Meeting: ఈనెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం