ETV Bharat / city

Telangana letter to KRMB: 'ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మాత్రమే చేశాం.. ఆయకట్టు పెంచలేదు' - Telangana letter to KRMB

Telangana letter to KRMB: కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కల్వకుర్తి ఆయకట్టు విషయంలో కొత్తగా ఆయకట్టు పెంచలేదని ప్రస్తావించింది. ఆయకట్టు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను లేఖకు జతచేశారు.

Telangana letter to KRMB
Telangana letter to KRMB
author img

By

Published : Dec 19, 2021, 3:47 PM IST

Telangana letter to KRMB: కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ మరోసారి లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో పేర్కొన్న రెండు అంశాలను ఒక్కటిగా పొందుపరచాలని లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్‌లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండో కాంపోనెంట్‌ను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచినట్లుగా చూపించడం తప్పని లేఖలో పేర్కొన్నారు.

kalwakurthy lift irrigation scheme: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచినా.. నీటి కేటాయింపులు పెంచలేదని పేర్కొన్నారు. ఆ పెరిగిన ఆయకట్టుకు సరిపొయేలా నీటి కేటాయింపులను తెలంగాణ ప్రభుత్వం చేసిందే తప్ప.. కొత్తగా ఆయకట్టును పెంచలేదని స్పష్టం చేశారు. ఆయకట్టు పెంచుతూ ఏపీ జారీ చేసిన జీవోలను అధికారులు లేఖకు జతచేశారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేట్టు.. 2006లోనే బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట నివేదించిన డీపీఆర్‌లో ఉందని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన జీఎన్​ఎస్‌ఎస్‌, వెలిగొండ, టీజీపీ ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట నివేదించినట్టు గుర్తుచేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 885 అడుగుల వద్ద నీటిని తీసుకునేట్లు డిజైన్ ఉందని కేఆర్​ఎంబీకి రాసిన లేఖలో వివరించారు.

ఇదీ చూడండి:

Students Letter to Principal for watching PUSHPA: సార్...పుష్ప సినిమాకి...మీకూ ఓ టిక్కెట్ ఉంది ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.