ETV Bharat / city

బకాయిల బాధ తీర్చుకునేందుకు.. తెలంగాణ విద్యుత్ శాఖ వినూత్న ప్రయత్నం! - prepaid meters in telangana government schools

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఇప్పటి వరకు విద్యుత్తును వినియోగించుకున్న తర్వాత బిల్లులు కట్టేవారు. ఈ బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు కోట్లకు చేరుకున్నాయి. ఈ విషయమై తెలంగాణ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు.. వినూత్న చర్య తీసుకుంటున్నారు. దుబారాను తగ్గించే క్రమంలో ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. దశల వారీగా మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో బిగిస్తున్నారు. ఇప్పటికే మీటర్లు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, పాఠశాలలకు ఈ మీటరు కోసం రూ.8,687 చెల్లించాలని తెలంగాణ విద్యుత్తు శాఖ నోటీసులు జారీ చేసింది.

prepaid meters in government offices
బిల్లు కడితేనే కరెంట్
author img

By

Published : Feb 11, 2021, 5:57 PM IST

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలో ప్రీపెయిడ్‌ మీటర్లు బిగిస్తున్నారు. గతేడాది నుంచి దశల వారీగా మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని బిగించడం పూర్తి కాగానే విద్యుత్తును కొనుక్కొని వినియోగించాల్సి ఉంటుంది. ఈ మీటర్లలో చిప్‌ను ఏర్పాటు చేస్తారు. ఎన్ని యూనిట్లు అవసరం ఉంటే ఆ మేరకు రీచార్జీ కార్డును కొనుగోలు చేసుకొని అందులో వేసుకుంటే విద్యుత్తు సరఫరా అవుతుంది. అయిపోతే సరఫరా నిలిచిపోతుంది. తిరిగి రీఛార్జీ చేసుకుంటే సరఫరా మొదలు అవుతుంది. ప్రీపెయిడ్‌ మీటర్లతో అవసరం మేరకు పొదుపుగా వినియోగించుకునే వీలుంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు బిల్లులు చెల్లించకపోవడంతో జిల్లాలో రూ.20 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తు శాఖకు బిల్లుల వసూలు బాధ తప్పుతుంది.

పాఠశాలలపై భారం

ఉమ్మడి జిల్లాలో 3,956 పాఠశాలలు ఉన్నాయి. దశల వారీగా ఆయా జిల్లాల్లోని పాఠశాలల్లో ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో దానికి రూ.8,687 చెల్లించాలని ఆ శాఖ నోటీసులు జారీ చేసింది. పాఠశాలలకు నిర్వహణ నిధుల కింద ప్రాథమిక పాఠశాలలకు ఏడాదికి రూ.10 వేలు మంజూరవుతాయి. అది కూడా విడతల వారీగా మంజూరు చేస్తారు. ప్రాథమిక పాఠశాలలకు ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం రూ.3 వేలు విడుదల చేశారు. ఉన్నత పాఠశాలలకు రూ.25-40 వేలు విడుదల చేస్తారు. ఇప్పటి వరకు కేవలం రూ.10-15 వేలు మంజూరయ్యాయి. వీటి నుంచి 50 శాతం మీటర్లకు, విద్యుత్తు బిల్లును చెల్లిస్తే.. పాఠశాలను ఎలా కొనసాగించాలని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వం నేరుగా మీటర్లు బిగించే ఏర్పాట్లు చేస్తే, నెల వారీ బిల్లులు చెల్లించే వీలుంటుందని వారు తెలిపారు.

విడతల వారీగా చెల్లించవచ్చు

ప్రీపెయిడ్‌ మీటర్లకు సంబంధించిన డబ్బులు నెల వారీగా బిల్లులో విడతల వారీగా చెల్లించే అవకాశం ఉంది. నిధుల కొరత ఉన్న పాఠశాలలు విడతల వారీగా చెల్లించవచ్ఛు జిల్లాలో ఇంకా కొన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో మీటర్లు బిగించాల్సి ఉంది. అన్నింట్లో మీటర్లను బిగించిన తర్వాత చిప్‌ పద్ధతి అమల్లోకి వస్తుంది. ప్రీ పెయిడ్‌ మీటరు ఏర్పాటు చేసినా గతంలో మాదిరిగానే మీటర్‌ రీడింగ్‌ను బట్టి బిల్లు వస్తుంది.

- ఉత్తమ్‌జాడే, ఎస్‌ఈ, ఆదిలాబాద్‌

ఉమ్మడి జిల్లాలో మొదటిదశ ప్రీపెయిడ్‌ మీటర్లు, విద్యుత్తు వినియోగం (కిలోవాట్లలో)

జిల్లా మీటర్లు వినియోగం

ఆదిలాబాద్‌ 984 3,064

నిర్మల్‌ 785 5,140

మంచిర్యాల 690 3,708

కుమురం భీం 1,095 4,900

  • ఇదీ చూడండి :

బెడ్​షీట్స్​ మాటున.. ఎర్రచందనం అక్రమ రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.