ETV Bharat / city

తెలంగాణ: ఎంసెట్​కు సర్వం సిద్ధం - Telangana EAmcet Engineering Exam

తెలంగాణ ఎంసెట్​ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9 నుంచి 14 వరకు.. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. తెలంగాణ, ఏపీలలో 102 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.

telangana-eamcet-engineering-exam-on-september
రేపటి ఎంసెట్​కు సర్వం సిద్ధం
author img

By

Published : Sep 8, 2020, 11:12 PM IST

ఈనెల 9 నుంచి 14 వరకు జరగనున్న తెలంగాణ ఎంసెట్​ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సర్వం సన్నద్ధమైంది. కరోనా కష్టకాలమున్నా.. ఒక్క నిమిషం నిబంధనలో ఎలాంటి మార్పు లేదని కన్వీనర్ గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆలస్యంగా వస్తే అనుమతించేది లేదని వెల్లడించారు.

తెలంగాణలో 79, ఆంధ్రప్రదేస్​లో 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్​లో మధ్యాహ్నం3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఎంసెట్​ ఇంజినీరింగ్ విభాగానికి లక్షా 43వేల 165 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్​ నమోదు చేయకూడదని నిర్ణయించారు. అభ్యర్థి నిర్ధరణ కోసం వెబ్​క్యామ్​ ద్వారా ఫొటో తీసి పోల్చి చూస్తారని కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.

పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. భౌతిక దూరం పాటించేందుకు పరీక్షా కేంద్రం వద్ద క్యూలైన్లు, సర్కిళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. థర్మల్​ స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థులను లోనికి పంపిస్తామని తెలిపారు. శానిటైజర్, నీళ్ల సీసాను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా.. పరీక్ష రాయాలని కన్వీనర్ గోవర్ధన్ సూచించారు.

ఇదీ చదవండి:

'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.