ETV Bharat / city

నలుగురిని పొట్టనబెట్టుకున్న 'కుని' శస్త్రచికిత్సలు.. కారణాలేంటి..? - ఇబ్రహీంపట్నంలో కుని ఆపరేషన్ వికటించి మహిళలు మృతి

Family Planning Surgery Incident: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న నలుగురు మృతిచెందడం కలకలం రేపింది. ఇప్పటికే ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ మిగతావారిని ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు డీహెచ్​ ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది.

family planning operation
family planning operation
author img

By

Published : Aug 30, 2022, 10:27 PM IST

నలుగురిని పొట్టనబెట్టుకున్న 'కుని' శస్త్రచికిత్సలు.. కారణాలేంటి..?

Family Planning Surgery Incident: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్న మహిళల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. మూడ్రోజుల తర్వాత కొందరు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. 28న నర్సాయిపల్లికి చెందిన మమత చికిత్సపొందతూ చనిపోయారు. సోమవారం మంచాల మండలం లింగంపల్లి వాసి సుష్మ మృతిచెందారు. సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక చికిత్స పొందుతూ మరణించారు.

మహిళలు మృతిచెందటం కలకలం రేపటంతో వైద్యరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ విచారణ చేపట్టారు. శస్త్రచికిత్సలు జరిగే గదిని పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆపరేషన్లు చేయించుకున్న మిగితా మహిళలను మళ్లీ పిలిపించి.. వారిలో ఇబ్బందులు ఉన్న కొందరిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో 11 మందికి, నిమ్స్‌లో 12మందికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ఈ ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణలు కమిటీని ప్రభుత్వం నియమించింది. పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యుడి లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు చేశామని శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, రెండు పడకల గదుల ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ విషయంపై అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ చేపడతామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

"ఇబ్రహీంపట్నంలో నిపుణులైన వైద్యులతోనే మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాం. నలుగురు మహిళలు తమకు గ్యాస్ట్రో లక్షణాలున్నట్లు చెప్పారు. తగిన చికిత్స అందించినా నలుగురు చనిపోవడం దురదృష్టకరం. మహిళల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించాం. కు.ని. ఆపరేషన్ చేయించుకున్న 30 మందికీ చికిత్స అందిస్తున్నాం. అందులో ఏడుగురికి పలు ఆరోగ్య సమస్యలు గుర్తించి వారిని అపోలో ఆస్పత్రికి పంపించాం. మిగతా అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఘటనపై అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నాం. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశాం. కు.ని. శస్త్రచికిత్స చేసిన వైద్యుడి లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేశాం. రోజుకు 30 ఆపరేషన్లు చేయాలి కానీ ఆరోజు 34 చేశారు." - శ్రీనివాస్ రావు, ప్రజారోగ్య సంచాలకులు

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం పరిధిలో 34 మందికి డబుల్ పంచర్ లాప్రోస్కోపి నిర్వహించామని డీహెచ్ తెలిపారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా డీబీఎల్ అనేది అడ్వాన్స్ మెథడ్ అని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని.. 34 మందికి ఈ ఆపరేషన్ చేస్తే దురదృష్టవశాత్తు అందులో నలుగురు మరణించారని వెల్లడించారు. మృతుల పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వారి మరణానికి గల కారణం తెలుస్తుందని డీహెచ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఇకపై శస్త్రచికిత్స సమయంలో కచ్చితమైన నిబంధనలు అమలు చేసేలా జాగ్రత్తపడతామని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.