తెలంగాణలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 80,658 మంది నమూనాలను పరీక్షించగా.. 453 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,859కి చేరింది. తాజాగా మహమ్మారికి ముగ్గురు బలి కాగా.. మొత్తం మృతుల సంఖ్య 3,828కి పెరిగింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.14 శాతానికి చేరింది. వైరస్ బారి నుంచి మరో 614 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,242 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో..
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 54,455 నమూనాలను పరీక్షించగా 1,413 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,83,721కి చేరింది. తాజాగా 18 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. మరోవైపు.. 1,795 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19,549 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,52,47,884 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
జాతీయ స్థాయిలో..
దేశంలో వరుసగా రెండోరోజు కొవిడ్ కేసుల్లో తగ్గుదల నమోదైంది. ఒక్కరోజే 35,499 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 39,686 మంది కొవిడ్‌ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.39 శాతానికి చేరింది.
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరమంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 16,11,590 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 50,86,64,759 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు వివరాలు..
- కేరళలో ఒక్కరోజే 18,067 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 93 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 151 మంది మరణించారు.
- కర్ణాటకలో ఒక్కరోజే 1,598 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 20 మంది చనిపోయారు.
- తమిళనాడులో 1,956 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 58 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా కొత్త మరణాలేవీ నమోదు కాలేదు.
- బంగాల్లో కొత్తగా 675 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 12 మంది మరణించారు.
- గుజరాత్లో 25 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్‌లో మరో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది.
- ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 66 మంది మరణించారు.
ఇదీ చదవండి: