Teachers Unions meets Minister Botsa: రాష్ట్రంలో 14 వేల మంది ఉపాధ్యాయులు మున్సిపల్ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్నారని ఏపీ మున్సిపల్ పాఠశాలల యూనియన్ నేతలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను విద్యాశాఖలో కలుపుతు జీవో ఇచ్చినా.. ఉపాధ్యాయుల సమస్యలు తీరలేదని అవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను జీతాలు మాత్రమే విద్యాశాఖ నుంచి ఇస్తున్నారు కానీ మిగిలిన సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల విషయంలో మంత్రి బొత్సతో సమావేశమై సమస్యలను విన్నవించామని స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నాటికి సమస్యలు లేకుండా చుస్తామని మంత్రి హమీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: