ETV Bharat / city

16 నెలల వైకాపా అవినీతి పాలనపై సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు - చంద్రబాబు లేటెస్ట్ కామెంట్స్

వైకాపా పాలనలో మనుషులకే కాదు.. దేవుళ్లకు కూడా రక్షణ లేదని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఆలయాలపై ఇన్ని దాడులు ఏ ప్రభుత్వం హయాంలోనూ జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై వరుస దాడులతో.. వైకాపా 16 నెలల పాలనలో 16 శాతం ఓటింగ్​కు దూరమైందని విమర్శించారు. విశాఖ భూముల్లో వైకాపా వన్ సైడ్ ట్రేడింగ్, నాసిరకం మద్యం బ్రాండ్లపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు 2 నెలల్లో 2 సార్లు పెంచడం హేయమైన చర్యని విమర్శించారు.

chandrababu
chandrababu
author img

By

Published : Sep 18, 2020, 6:26 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో 16 శాతం ఓటింగ్​కు దూరం అయ్యిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు వైకాపాకు దూరం అయ్యారని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయాలన్న రైతులపై కేసులు పెట్టడం వైకాపా నేతల రాక్షసత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. నరసరావుపేట పార్లమెంట్ నాయకులతో చంద్రబాబు ఆన్​లైన్​ సమావేశం నిర్వహించారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం దేశంలో మరేదీ లేదని విమర్శించారు. 16 నెలల వైకాపా అవినీతి కుంభకోణాలపై కూడా సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ భూముల్లో వైకాపా వన్ సైడ్ ట్రేడింగ్, నాసిరకం మద్యం బ్రాండ్లపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు.

ఎన్నడూ లేని దాడులు

దేవాలయాలపై ఇన్ని దాడులు గతంలో ఎన్నడూ లేవన్న చంద్రబాబు... మనుషులకే కాదు, దేవుళ్లకూ వైకాపా పాలనలో రక్షణ లేదని విమర్శించారు. ఆలయాలపై వరుస దాడులు చూస్తుంటే రాక్షస కాలం గుర్తొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాక్షసుల కాలంలో కూడా ఇన్ని ఆగడాలు లేవని తెలిపారు. కుల, మత విద్వేషాలు రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ధరలు పెంపు హేయమైన చర్య

పల్నాడులో వైకాపా నాయకుల దుర్మార్గాలకు అంతే లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. తన ఇంటిగేట్లకు కట్టిన తాళ్లే, వైకాపాకు ఉరితాళ్లని అప్పుడే హెచ్చరించానని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం ఏపీలోకి సరఫరా నిత్యకృత్యమయ్యాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు 2 నెలల్లో 2 సార్లు పెంచడం హేయమని దుయ్యబట్టారు. వైకాపా వచ్చాక ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపారన్న అయన...వీటికి వైకాపా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి : 23న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.