రాజధాని అమరావతి వినాశనానికి యత్నించిన ముఖ్యమంత్రి జగన్.. నేడు ఎస్సీల ముసుగులో దాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారని తెదేపా అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. రాజధానికి భూములిచ్చిన ఎస్సీలకు న్యాయం చేయటానికి ఆనాడు చంద్రబాబు చూశారని తెలిపారు. నేడు జగన్ ప్రభుత్వం ఇళ్లపట్టాల పేరుతో ఎస్సీల భూములు లాక్కోవటానికి జీవోనెం 72 తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈ భూములను వైకాపా నేతలు అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 7వేల కోట్ల రూపాయలను అధికార పార్టీ నేతలు దోచేశారని విమర్శించారు.
జగన్ రెడ్డి అవినీతి జగమంతా తెలుసునని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు ధ్వజమెత్తారు. మొన్నటి వరకు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు అసైన్డ్ భూముల దోపిడీ అని కొత్తరాగం తీసుస్తున్నారని మండిపడ్డారు. తలా తోక లేని ఫిర్యాదులు చేయటంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి దిట్ట అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్కు నైతిక విలువలు ఉంటే బెదిరింపులతో తీసుకున్న దళిత భూములను.. తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల భూములు లాక్కున్న చరిత్ర వైయస్ కుటుంబానిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ.. హత్యాయత్నం చేస్తే కేసులు పెట్టరా..?: పవన్ కల్యాణ్