ETV Bharat / city

అమరావతి ఉద్యమంపై గీతాన్ని విడుదల చేసిన తెదేపా

రైతుల ఉద్యమం ప్రారంభమై ఈ నెల 17వ తేదీకి ఏడాది కాబోతున్న సందర్భంగా తెదేపా నేత సత్యవాణి ఓ గీతాన్ని రూపొందించారు. ఈ పాటను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు.

Tdp
Tdp
author img

By

Published : Dec 14, 2020, 3:56 PM IST

అమరావతి ఉద్యమంపై తెదేపా విడుదల చేసిన గీతం

అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీన ఉద్దండరాయునిపాలెంలో జరిగే బహిరంగ సభతో జగన్‌ తలొంచక తప్పదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్పష్టం చేశారు. పేరు నచ్చనంత మాత్రాన రాజధానినే మార్చాలనుకున్న వింత ముఖ్యమంత్రి జగన్‌ అని దుయ్యబట్టారు. 365వ రోజు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏడాది పాటు సాగిన ఉద్యమం మరేదీ లేదన్న వర్ల రామయ్య... రైతులను కనీసం చర్చలకు కూడా పిలవకుండా కర్కశంగా వ్యవహరించారన్నారు.

అమరావతి ఉద్యమం ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ నాయకురాలు సత్యవాణి రూపొందించిన పాటను విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు. ఎం.ఎం.శ్రీలేఖ ఈ పాటకు సంగీతాన్ని అందించగా, రామజోగయ్యశాస్త్రి ఈ గీతాన్ని రచించారు. తెదేపా ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చదవండి : అమరావతిలో రాజధాని.. భాజపా నిర్మించి ఇస్తుంది: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.