సీఎం, మంత్రుల వ్యవహార సరళి వింతగా ఉందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. జస్టిస్ కనగరాజ్ చెన్నై నుంచి వచ్చారు.. ఆయనకు క్వారంటైన్ అక్కర్లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నియామకం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వైకాపా నేతలు, వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కరోనా కేసులు 405... ఆ రెండు జిల్లాల్లోనే 157