కరోనా వ్యాప్తి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ తీరుపై నేతలు సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా పాల్గొనగా.... వివిధ ప్రాంతాల నుంచి నేతలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. రైతు కష్టాలు, ఉద్యాన పంటలు, ఆక్వా నష్టాలపై చర్చించారు. ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, ఆదాయ, ఖర్చుల అంశంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పేద వర్గాలకు 5 వేల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం...ఈ అంశంలో ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలనే కోణంలోనూ చర్చించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: 'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'