ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతుడికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి పరిహారం విషయంలో బేరసారాలు జరపడం సరికాదని అన్నారు. కంపెనీని లీజుకు తీసుకున్న ఎంపీ ఎవరని వర్ల ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ఎంపీ మద్యం తయారు చేయడమేంటని ప్రశ్నించారు. పంచ భూతాలను అమ్ముకోడానికేనా రాజకీయాల్లోకి వచ్చారని వర్ల నిలదీశారు.
సారాకి రంగు వేసి ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలోని 21 డిస్టలరీలో మద్యం నాణ్యతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మద్యం పాలసీలో పారదర్శకత లేదని ఆయన విమర్శించారు.
ఇదీ చూడండి..: ఎస్పీవై గ్యాస్ లీక్ మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం