ETV Bharat / city

'జస్టిస్ కనగరాజ్​కు క్వారంటైన్ నిబంధనలు వర్తించవా..?' - tdp nimmala rama naidతెదేపా నేత నిమ్మల రామానాయుడు వార్తలుu

ప్రపంచమంతా కరోనాపై యుద్ధం చేస్తుంటే సీఎం జగన్ మాత్రం ఎన్నికల కమిషనర్​పై యుద్దం చేస్తున్నారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసులలో దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉన్న తమిళనాడు నుండి 74 సంవత్సరాల వయసున్న జస్టిస్ కనగరాజ్​ విజయవాడ ఎలా వచ్చారని ప్రశ్నించారు.

tdp-nimmala-rama-naidu
tdp-nimmala-rama-naidu
author img

By

Published : Apr 12, 2020, 3:20 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్పుపై తేదేపా నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. దేశమంతా కరోనాపై పోరాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రజల ప్రాణాలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారు 14 రోజులు హోమ్ క్వారంటైన్​లో ఉండాలన్న సీఎం...ఆ నిబంధనలు జస్టిస్ కనగరాజు, ఆదిమూలపు సురేష్, విజయ సాయి రెడ్డి వంటి వారికి వర్తించవా అని ప్రశ్నించారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భారత్ అంతా భావిస్తుంటే.. వైకాపా మాత్రం లాక్ డౌన్ కొన్ని జోనులకు పరిమితం చేయమనటం వింతగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలపై జగన్ బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతను ప్రధానికి తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇవీ చదవండి: లాక్​డౌన్ వేళ బలమైన బంధాలకు ఇదే దారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.