ETV Bharat / city

ఎంపీ రఘురామ అరెస్టుపై లోక్​సభ స్పీకర్​కు తెదేపా ఎంపీలు లేఖ - లోక్‌సభ స్పీకర్​కు తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై లోక్​సభ స్పీకర్​కు తెదేపా ఎంపీలు లేఖ రాశారు. రాజద్రోహం కేసుపెట్టి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడమేనని ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్​లు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp mps wrote a letter to loke sabha speaker about mp ragurmakrishnarajau arrest
ఎంపీ రఘురామ అరెస్టుపై లోక్​సభ స్పీకర్​కు తెదేపా ఎంపీలు లేఖ
author img

By

Published : May 16, 2021, 11:44 PM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై లోక్‌సభ స్పీకర్​కు తెదేపా ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రలు లేఖ రాశారు. ప్రభుత్వం పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడారంటూ.. రాజద్రోహం కేసుపెట్టి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని, నిరసన గళాన్ని అణచివేయడమేనని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారుల కస్టడీలో ఉన్న రఘురామపై థర్డ్ డిగ్రీ అమలు చేసి, హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని రఘురామకృష్ణరాజు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఈ అంశంపై విచారించిన న్యాయస్థానం.. ఆయనకు వై-కేటగిరి భధ్రత కల్పించాలని అధికారులను ఆదేశించిందని తెలిపారు.

ప్రతి పౌరుడికి రాజ్యాంగం జీవించే హక్కును కల్పించిందని, కానీ ఆంధ్రప్రదేశ్​లో వైకాపా ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తోందని ఎంపీలు రామ్మోహన్, కనకమేడల రవీంద్ర ఆక్షేపించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేకం చోటుచేసుకుంటున్నాయని, సహ పార్లమెంటు సభ్యుడైన రఘురామపై ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. పార్లమెంటు సభ్యులపై ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'జులై నాటికి 51.6 కోట్ల టీకా డోసుల పంపిణీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.