రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ప్రతిపక్ష నేతలను అన్ని రకాలుగా బెదిరిస్తున్నారని విమర్శించారు. సోమవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైకాపా సర్కార్‌పై ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తెచ్చిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులను ఇంతలా ఉపయోగించుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబును దూషించడమే ఎంపీ విజయసాయిరెడ్డి పని. రామతీర్థంలో ఆలయంలోకి వెళ్లకుండా చంద్రబాబును ఎందుకు అడ్డుకున్నారు. ఆలయాల ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజును ఎందుకు తొలగించారు. పరిపాలనలో విఫలమైన మంత్రులను మీరు తొలగించారా. కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించేలా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పంటకు గిట్టుబాటు ధర లేక... రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వ్యవసాయం చేసేందుకు వీల్లేని పరిస్థితులు కల్పించారు- కనకమేడల రవీంద్ర కుమార్, ఎంపీ
ఇదీ చదవండి : నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఎమ్మెల్యే రోజా ఆవేదన