ETV Bharat / city

"మహిళలకు జగన్‌ ఇచ్చిన హామీ గోవిందా.. గోవిందా.." - Tdp MLCs staged a protest news

tdp mlcs concern: నాటుసారా మరణాలపై నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో 8వ రోజు తెదేపా ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. మద్య నిషేధంపై మహిళలకు జగన్‌ ఇచ్చిన హామీ గోవిందా.. గోవిందా.. అంటూ నినాదాలు చేశారు. నాటుసారా మృతుల పాపం జగన్‌రెడ్డిదే అని ప్లకార్డుల ప్రదర్శించారు. నాటు సారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

protest
protest
author img

By

Published : Mar 24, 2022, 11:22 AM IST

tdp mlcs concern: మద్య నిషేధంపై జగన్‌ మహిళలకు ఇచ్చిన హామీ గోవిందా.. గోవిందా.. అనే నినాదాలు చేస్తూ వరుసగా ఎనిమిదవరోజు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నిరసన ర్యాలీకి చేపట్టారు. కల్తీ నాటుసారాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జే-బ్రాండ్ మద్యంవల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ ఆరోపించారు. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు.

కల్తీసారా మరణాలు.. జగన్ రెడ్డి హత్యలేనని నేతలు నినాదాలు చేశారు. మద్యపాన నిషేధం అని మహిళల మెడల్లో తాళ్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెదేపా శాసనసభ పక్షం సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ చేపట్టింది.

సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్‌: కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యంపై ప్రజా చైతన్య ఉద్యమం చేపడతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. శాసనసభలో మద్యం, కల్తీ నాటుసారాపై ప్రకటనలిచ్చి పారిపోకుండా.. ధైర్యం ఉంటే తమతో చర్చకు రావాలని సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. తెలుగు మహిళలు త్వరలోనే బెల్టు షాపులు ధ్వంసం చేస్తారని హెచ్చరించారు.

అందుకే మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు: శాసన సభలో కల్తీ సారా, కల్తీ మద్యంపై చర్చ పెట్టాలని అడిగినందుకు తమ సభ్యులను సస్పెండ్ చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. కేవలం 30 నిమిషాలు మాత్రమే చర్చ పెట్టాలని కోరామన్నారు. తమ సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాతే సీఎం జగన్ సభలో మాట్లాడారన్నారు. అదికూడా అజెండాలో లేని అంశంపై చర్చించారని ఆరోపించారు. సారా నామూనాల్లో రాసాయనాలున్నాయని అసెంబ్లీలో సీఎం ఒప్పుకున్నారని.. ఆ తర్వాత అవి కల్తీ సారా మరణాలు కాదు.. సహజ మరణాలని అనడం దారుణమన్నారు. కల్తీ సారాపై మండలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్‌ విసిరారు.

రాష్ట్రంలో ఏ మద్యం దుకాణానికైనా వెళదామని.. నమూనాలను ల్యాబ్స్​కు పంపుదామని.. అందులో రసాయనాలు ఉన్నాయని నిరూపిస్తామని నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి.. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చి ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎన్ని కొత్త బ్రాండ్లు తెస్తారో.. ఎంత మంది ప్రాణాలను బలితీసుకుంటారో తెలియదన్నారు. అధికారంలోకి రాక ముందు రూ.6వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయాన్ని.. ఆ తర్వాత రూ.22వేల కోట్లకు పెంచిన జగన్మోహన్ రెడ్డిని.. జగన్ మోసపు రెడ్డి అనికాక, ఇంకేం అనాలని ప్రశ్నించారు.

త్వరలోనే గుణపాఠం నేర్పిస్తాం: కల్తీ సారా వల్లే 26 మంది చనిపోయారని మృతుల కుటుంబసభ్యులే చెబుతుంటే... అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలని సీఎం జగన్ అనటం దారుణమని నారా లోకేశ్ అన్నారు. బాధిత కుటుంబాలకు తెదేపా తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేశామన్నారు. బాబాయ్‌ హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు.. ఇప్పుడు సారా మరణాలను సహజ మరణాలంటున్నారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం నేర్పిస్తామని నారాలోకేశ్ తెలిపారు.

ఇదీ చదవండి: అందుకే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు: తెదేపా ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.