ETV Bharat / city

ప్రశ్నోత్తరాలకు అనుమతించండి: తెదేపా ఎమ్మెల్సీలు - అసెంబ్లీ సమావేశాలపై తెదేపా ఎమ్మెల్సీలు

శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు తెదేపా ఎమ్మెల్సీలు లేఖ రాశారు. కొవిడ్‌ సాకుతో ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను తప్పించుకోవాలనుకుంటోందని విమర్శించారు. ప్రశ్నోత్తరాలను అనుమతించి సభ్యుల హక్కలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోకి అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించాలని లేఖలో కోరారు.

tdp mlc's letter to legislative council on question hours
శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్
author img

By

Published : Nov 27, 2020, 10:43 AM IST

కొవిడ్ సాకుతో వైకాపా ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను తప్పించుకోవాలనుకుంటోందని తెదేపా ఎమ్మెల్సీలు విమర్శించారు. స్వల్పకాలిక చర్చకు ప్రశ్నోత్తరాలను అనుమతించి సభ్యుల హక్కులను కాపాడాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​కు ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బుద్దా వెంకన్న, మంతెన వెంకట సత్యనారాయణ రాజులు లేఖ రాశారు. ప్రజా సమస్యలను లేవదీసి వారి సమస్యల పరిష్కారానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

చట్టసభల్లోకి మీడియాను అనుమతించకపోవటం రాజ్యాంగ ఉల్లంఘనేనని తెదేపా ఎమ్మెల్సీలు విమర్శించారు. ప్రభుత్వం తన సొంత పత్రికలకు అనుమతి ఇస్తూ మిగతావారికి అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదంటూ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీలోకి అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించాలని కోరారు. చట్టసభల కవరేజిలోనూ మీడియా పట్ల ప్రభుత్వం వివక్షకు పాల్పడుతోందని.. ఇది ఆర్టికల్ 19 ధిక్కరించడమేనని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు... నోటిఫికేషన్ విడుదల...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.