ETV Bharat / city

క్రీడాకారులంటే పేకాట ఆడేవారని మంత్రి అనుకుంటున్నారు: ఎమ్మెల్సీ మంతెన - ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు

మంత్రి అవంతి శ్రీనివాస్​పై తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్రీడా మంత్రిగా ఉన్న అవంతి... కేవలం చంద్రబాబును విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. 15నెలల వైకాపా పాలనలో ఎన్ని క్రీడలు నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

tdp mlc manthena satyanarayana raju
tdp mlc manthena satyanarayana raju
author img

By

Published : Aug 29, 2020, 5:25 PM IST

వైకాపా పాలనలో క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. క్రీడాకారులంటే పేకాట ఆడేవారని మంత్రి అవంతి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో రాష్ట్రాన్ని క్రీడా హబ్​గా నిలిపితే ...వైకాపా పేకాట హబ్​గా మార్చిందని మండిపడ్డారు.

రాష్ట్ర క్రీడా మంత్రికి ఇవాళ క్రీడా దినోత్సవం అనే విషయం తెలియకపోవడం ఆయన శాఖపై ఎంత శ్రధ్ద వహిస్తున్నారో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుని విమర్శించడం తప్ప అవంతికి మరో ఆట కనపించడం లేదన్నారు. పేకాట, గుండాట ఆడేవారని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. క్రికెట్, పేకాట బెట్టింగులపై ఉన్న శ్రద్ధ యువత ఆడే క్రీడలపై లేకపోవడం బాధాకరమని తెలిపారు. 15 నెలల్లో రాష్ట్రంలో ఎన్ని క్రీడలు నిర్వహించారో అవంతి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

కారుతో ఎస్సైని ఢీకొట్టి... కొంత దూరం తీసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.