కర్నూలులో కరోనా కేసులు పెరుగుతుండడంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మరణాలు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. చనిపోయిన వారిని హైవే పక్కన పూడ్చిపెట్టి.. వస్తువులను అక్కడే వదిలేయటాన్ని తీవ్రంగా ఖండించారు. పాలకులు సీరియస్గా లేరు కాబట్టే సిబ్బంది కరోనాను సీరియస్గా తీసుకోవట్లేదని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: