ETV Bharat / city

సీఎం జగన్ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజ్యంగా మారుస్తున్నారన్న నిమ్మల రామానాయుడు - జగన్​పై విరుచుకుపడిన నిమ్మల

Nimmala RamaNaidu గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో తాడొపేడో అన్నట్లుగా విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా సీఎం జగన్​ నుంచి చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ తెదేపా నేత నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు.

Nimmala Ramanaidu on CM Jagan
సీఎం జగన్ ఏపీని ఫ్యాక్షన్ రాజ్యంగా మారుస్తున్నారు
author img

By

Published : Aug 26, 2022, 3:29 PM IST

Nimmala RamaNaidu on Chandrababu Security: జగన్ పాలనలో చంద్రబాబు ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. సొంత బాబాయ్​ను చంపినవాడి కన్ను నేడు చంద్రబాబుపై పడిందని ప్రజలు ఆందోళన పడుతున్నారన్నారు. ఉన్మాద పాలన నుంచి ఏపీని కాపాడుకునేందుకు కేసులు, జైళ్లను లెక్క చేయమని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి, జగన్ రెడ్డికి మానవత్వం లేదు గనుకనే అన్నా క్యాంటీన్​ను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. తన సర్వేల్లో వైకాపాకు సీట్లు రావని తేలడంతోనే ప్రశాంతంగా ఉన్న ఏపీని ఫ్యాక్షన్ రాజ్యంగా జగన్ మారుస్తున్నారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.