మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును తెదేపా శ్రేణులు ఖండించాయి. అక్రమాలను ప్రశ్నిస్తున్న తెదేపా నాయకులను అరెస్టు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు చేసేవారే.. పోలీసులకు పెద్దమనుషులుగా కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు.
కొల్లు రవీంద్ర అరెస్టు ప్రభుత్వ దుర్మార్గచర్య అని మాజీమంత్రి దేవినేని ఉమ దుయ్యబట్టారు. అక్రమ కేసులకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. వైకాపా అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని తెదెపా నేత నిమ్మకాయల చిన్నరాజప్ప మండిపడ్డారు. రవీంద్రపై తరచూ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని.. ఇది దుర్మార్గమని కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. తక్షణమే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: