రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే గిరిధర్, మాజీ ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ, సినీయర్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి క్షీణించాయని, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని నేతలు అవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డిని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడి దర్యాప్తు చేయిస్తామని కిషన్‌రెడ్డి తెదేపా నేతలకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు మరణించడం చాలా బాధకరమన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదని... కోడెల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర డిజీపీతోనూ మాట్లాడతానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ... వైకాపా కుట్రలపై పోరాటం చేస్తా: చంద్రబాబు