వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని తెదేపా నేతలు హెచ్చరించారు. గురజాలలో విక్రమ్ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు. అశోక్‌బాబు, బచ్చల అర్జునుడు... విక్రమ్‌ను విచారణ పేరుతో వేధించారని ఆరోపించారు.
హైదరాబాద్‌లో తలదాచుకున్న విక్రమ్‌ను విచారణ పేరుతో పోలీసులు పిలిపించారని, స్థానిక సీఐ విక్రమ్‌ను పదే పదే స్టేషన్‌కు పిలిపించారని తెలిపారు. రోజు స్టేషన్ కు వస్తున్న విక్రమ్‌ను ప్రత్యర్థులు కాపు కాసి హత్య చేశారని నేతలు మండిపడ్డారు. డీజీపీని కలిసి విక్రమ్ హత్యపై వాస్తవాలు అందించామని నేతలు తెలిపారు. హత్య కేసులో సీఐ భాగస్వామి అయ్యారని వేరే అధికారులతో విచారణ జరిపించాలని నేతలు డీజీపీని కోరారు.
ఇదీ చదవండి: