ETV Bharat / city

TDP LEADERS : వైకాపా సర్కార్ వైఖరిపై తెదేపా నేతలు ఆగ్రహం

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సహజవనరులన్నింటినీ వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను పూర్తిగా తగ్గిస్తానన్న హామీని విస్మరించారన్నారు. పెట్రోల్ ధరల పెంపుపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు.

తెదేపా నేతలు
తెదేపా నేతలు
author img

By

Published : Aug 27, 2021, 9:41 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2021 జూలై వరకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్‌ చేశారు. జీవోలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ప్రజలకు తెలియకూడదని భావిస్తున్నారంటే పాలకులు అవినీతి చేస్తున్నారనే భావించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ జీవోలను ఆన్​లైన్​లో ఉంచకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జీవోల దాపరికంపై గవర్నర్​కు ఫిర్యాదు చేసి, అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళతామని అశోక్ బాబు హెచ్చరించారు.

రాష్ట్రంలోని సహజవనరులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు కట్టబెట్టి, సొమ్ము చేసుకుంటున్నారని తెదేపా సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఇసుక రీచ్​లన్నింటినీ ఒకే వ్యక్తికి అప్పగించారని మండిపడ్డారు. కరోనా కారణంగా భవన నిర్మాణ సామగ్రి, గ్రానైట్ పరిశ్రమలు ఇప్పటికే తీవ్రనష్టాల్లో ఉన్నాయని, వారి నుంచి అధికార పార్టీ నేతలు అనధికారికంగా ఏటా రూ.350కోట్లు వసూలు చేస్తున్నారని ఆక్షేపించారు.

అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను పూర్తిగా తగ్గిస్తానన్న హామీని సీఎం జగన్ విస్మరించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తెదేపా హాయాంలో 60 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరలు, ప్రస్తుతం డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చమురు ధరల పెరుగుదలపై నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్ ధరల పెంపుపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. పెట్రో బాధితులందరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు.. పెట్రోల్ ధరలపై నానా యాగీ చేసిన వైకాపా నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారీతిన పన్నులు పెంచుతున్నారని ధ్వజమెత్తారు.

ఇదీచదవండి.

రిజిస్ట్రార్ ఆఫీస్​లో ప్రేమ పెళ్లి.. సడెన్​గా అమ్మాయి తల్లిదండ్రుల ఎంట్రీ.. ఆ తర్వాత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.